Bhoomika Chawla Euphoria trailer : నటి భూమికా చావ్లా ప్రధాన పాత్రలో నటించిన దర్శకుడు గుణశేఖర్ తాజా చిత్రం Euphoria ట్రైలర్ విడుదలైంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సమకాలీన సోషల్ డ్రామా ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ట్రైలర్లో మైనర్లలో పెరుగుతున్న నేరాలు, డ్రగ్స్, ఆల్కహాల్ ప్రభావం, సమాజంలో జరుగుతున్న ప్రమాదకర మార్పులు గాఢంగా చూపించారు. తనే చేసిన నేరంపై తానే కేసు వేసుకున్న మహిళ పాత్రలో భూమికా చావ్లా నటన హైలైట్‌గా నిలిచింది. “నేను అతన్ని కనడం తప్పు” అనే డైలాగ్ తీవ్ర భావోద్వేగాన్ని కలిగిస్తోంది.
Read also: Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!
ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, (Bhoomika Chawla Euphoria trailer) సారా అర్జున్, నాసర్ కీలక పాత్రలు పోషించారు. సంగీతం కాలభైరవ, సినిమాటోగ్రఫీ ప్రవీణ్ కె. పొతన్ అందించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గుణశేఖర్–భూమికా చావ్లా కలయిక కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: