Marakathamani 2 : 2017లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫాంటసీ–కామెడీ మూవీ ‘మరకతమణి’ కి ఇప్పుడు సీక్వెల్‌గా ‘మరకతమణి 2’ అధికారికంగా ప్రకటించారు. పొంగల్ సందర్భంగా (జనవరి 15, 2026) విడుదలైన స్పెషల్ ప్రోమో వీడియోతో ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేయగా, అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
మొదటి భాగాన్ని దర్శకుడు ARK సరోజన్ తెరకెక్కించగా, పెద్ద ప్రచారం లేకుండానే సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది. కామెడీ, అడ్వెంచర్, మిస్టరీ, సూపర్‌న్యాచురల్ అంశాలతో పాటు శాపం పట్టిన మరకతమణి కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరోగా ఆధి పినిశెట్టి, హీరోయిన్‌గా నిక్కి గల్రాని నటించి తమ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా విజువల్స్, VFX, డైలాగ్స్ కల్ట్ ఫాలోయింగ్‌ను తెచ్చాయి.
Read Also: NTR: ‘డ్రాగన్’ మూవీలో అనిల్ కపూర్
ఇప్పుడు తెరకెక్కనున్న ‘మరకతమణి 2’ లో ఆధి తన (Marakathamani 2) పాత్రలో మళ్లీ కనిపించనున్నాడు. నిక్కి గల్రాని కూడా ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. మొదటి భాగంలో నటించిన మునిష్కాంత్, ఆనందరాజ్, అరుణ్‌రాజా కామరాజ్ వంటి పాత్రధారులు కూడా తిరిగి నటించనున్నారు. అదనంగా సత్యరాజ్, ప్రియా భావాని శంకర్ ఈ సీక్వెల్‌కు చేరడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
దర్శకుడు ARK సరోజన్ ఈ సీక్వెల్‌లో కూడా ఫన్, మిస్టరీ, సూపర్‌న్యాచురల్ ఎలిమెంట్స్‌ను మరింత ఇంటెన్స్‌గా చూపించబోతున్నారని సమాచారం. సినిమాటోగ్రఫీని PV శంకర్, సంగీతాన్ని ధిబు నినాన్ థామస్, ఎడిటింగ్‌ను తిరుమలై రాజన్ నిర్వహిస్తున్నారు. Passion Studios, Axess Film Factory, Good Show, Dangal TV, RDC Media సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. మొదటి భాగం సక్సెస్ కావడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఫస్ట్ లుక్, టీజర్, షూటింగ్ అప్‌డేట్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: