సోషల్ మీడియా పరిచయం, ఆపై ప్రేమ.. సరిహద్దులు దాటి పాకిస్థాన్ (Pakistan) వెళ్లిన పంజాబ్ మహిళ సరబ్జీత్ కౌర్ కథ ఇప్పుడు కన్నీటి గాథగా మారింది. గతేడాది నవంబర్‌లో సిక్కు యాత్రికురాలిగా పాక్ వెళ్లి.. అక్కడే మతం మార్చుకుని వివాహం చేసుకున్న ఆమె.. ఇప్పుడు “నన్ను ఎలాగైనా భారత్‌కు తీసుకువెళ్లండి” అంటూ తన మొదటి భర్తను వేడుకుంటున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాకు చెందిన 48 ఏళ్ల సరబ్జీత్ కౌర్.. గతేడాది నవంబర్ 4వ తేదీన గురునానక్ జయంతి వేడుకల కోసం వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్ వెళ్లారు. అయితే యాత్రికులు అందరూ తిరిగి వచ్చినా ఆమె మాత్రం కనిపించకుండా పోయారు. విచారణలో ఆమె ఇస్లాం మతం స్వీకరించి ‘నూర్’గా పేరు మార్చుకున్నట్లు, షేఖుపురాకు చెందిన నాసిర్ హుస్సేన్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడి అయిది. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. తాను ఇష్ట పూర్వకంగానే నాసిర్‌ను పెళ్లాడానని వీడియోలు కూడా విడుదల చేశారు.
Read Also: US: L1 వీసాపై పని లేకుండా అమెరికాలో ఉంటే ఏమవుతుందో తెలుసా?

పాకిస్థాన్‌లో తన పరిస్థితి దారుణంగా ఉంది
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆడియోలో సరబ్జీత్ కౌర్ గొంతు ఎంతో దీనంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌లో తన పరిస్థితి దారుణంగా ఉందని.. భర్త, అతని కుటుంబం తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పాకిస్థాన్‌కు ప్రేమ కోసం వెళ్లలేదని.. తన అశ్లీల ఫోటోలను డిలీట్ చేయించుకోవడానికి వెళ్లానని తెలిపారు. నాసిర్ హుస్సేన్ వద్ద తన ఫోటోలు ఉన్నాయని… వాటితో అతను తనను బ్లాక్ మెయిల్ చేశాడని ఆమె పేర్కొన్నారు. సరబ్జీత్ కౌర్ గతేడాది లాహోర్ హైకోర్టును ఆశ్రయించి తమను పోలీసులు వేధించకుండా రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఆమె వీసా గడువు ముగియడం, ఆమె ఒక ‘భారత గూఢచారి’ అయి ఉండవచ్చని పాక్ మాజీ ఎమ్మెల్యే మహేందర్ పాల్ సింగ్ కోర్టులో పిటిషన్ వేయడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఆమె భర్త నాసిర్ పోలీస్ కస్టడీలో ఉండగా.. సరబ్‌జీత్‌ను లాహోర్‌లోని దారుల్ అమన్ (ప్రభుత్వ షెల్టర్ హోమ్)కు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: