हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP: అమరావతి రెండో దశ పూలింగ్ ఒకేచోట లేఅవుట్

Pooja
AP: అమరావతి రెండో దశ పూలింగ్  ఒకేచోట లేఅవుట్

రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం

విజయవాడ : అమరావతి రాజధాని(AP) విస్తరణలో భాగంగా రెండోదశలో 20,494 ఎకరాలు తీసుకుంటున్న ప్రభుత్వం అక్కడ భూములిచ్చే రైతులకు ఒకేచోట లేఅవుట్ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే అంచనాకు వచ్చినా ఎలా చేస్తే బావుంటుందనే అంశంపై మరింత సమాలోచనలు చేయాలని అనుకున్నారు. గత పూలింగు సమయంలో చేసిన లేఅవుట్ వల్ల ప్రభుత్వానికి అందాల్సిన ల్యాండ్ పార్సిల్స్ వేర్వేరు ప్రాంతాల్లో రావడంతో వాటిని కేటాయించాలన్నా ఇబ్బందికరంగా ఉందని నిపుణులు తెలిపినట్లు తెలిసింది. వేర్వేరు లేఅవుట్లు ఉండటంతో వాటన్నికి వేర్వేరుగా సదుపాయాల కల్పన చేయాల్సి ఉండటం కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.

Read Also: CM Chandrababu: అందరికీ ఆరోగ్యం అదే సంజీవని లక్ష్యం

AP

ఈ నేపథ్యంలో ప్రస్తుత భూ సమీకరణ ప్రాంతంలో ఒకేచోట లేఅవుట్ వేసి రైతులకు భూములు అప్పగించాలని అనుకున్నారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని నాలుగు గ్రామాలకు ఒకచోట, తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాలకు ఒకచోట ఇవ్వాలని ప్రాథమికంగా ప్రతిపాదించారు. దానిపైనా ప్రభుత్వం(AP) ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. లేదా ఏడు గ్రామాలకు ఒకేచోట ఇవ్వాలా అనేది మరో ప్రతిపాదనా ఉంది. దీనిలోనూ తుళ్లూరు మండల పరిధిలో ఉన్న మూడు గ్రామాలకు కొత్తగా లేఅవుట్ వేయాలా.

లేక గతంలో ప్రభుత్వానికి సంక్రమించిన భూముల్లో ప్లాట్లు కేటాయించాలా అనేది కూడా మరొక ప్రతిపాదనగా ఉంది. ఇటీవల రైతులు కూడా ఇదే అంశాన్ని కాంపిటెంట్ అథారిటీల ముందుంచారు. వారు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని దిగువస్థాయి అధికారులకు సమాచారం అందించారు. ఒకేచోట ప్లాట్లు వేసి ఇవ్వడం ద్వారా ప్రభుతానికి సంక్రమించే భూములు ఒకేచోట వస్తాయని, ప్రాజెక్టులకు, వేర్వేరు సంస్థలకు కేటాయించేందుకు వీలుగా ఉంటుందని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది.

రెండోదశ ల్యాండ్ పూలింగు ఏరియాలో అమరావతి గ్రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు. దీనిలో రైల్వేలైన్లు, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్రింగురోడ్డు, స్మార్ట్ ఇండిస్టీస్ వంటివి రెండోదశ పూలింగు ఏరియాలో చేపట్టనున్నారు. మూలపాడు వద్ద కట్టే వంతెన కూడా దాదాపు రెండోదశ పూలింగు ఏరియాలోకే వస్తుంది. దీంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరో నెలరోజుల్లోపు పూలింగు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈలోపే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం పూలింగు కింద తీసుకునే భూమిలో 30 శాతం రోడ్లు, సదుపాయాలకు కేటాయిస్తారు. పార్కులు, ఆటస్థలాలు, ఓపెన్ స్పేస్కు 10 శాతం, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఐదుశాతం, అఫర్డబుల్ హౌసింగ్కు ఐదు శాతం కేటాయిస్తారు. మిగిలిన భూమిలో రైతుల వాటాపోను మిలిగినది ప్రభుత్వపరం అవుతుంది. ఇందులో మెట్ట ప్రాంత రైతులకు ఎకరాకు 26 సెంట్ల భూమి వరకూ వెళుతుంది. జరీబులో రైతులకు 30 సెంట్ల భూమి వస్తుంది. అసైన్డ్ రైతులకు కేటగిరీ వన్ వారికి 26 సెంట్లు వస్తుంది. మిగిలిన వారికి వారి కేటగిరీని బట్టి తగ్గుతూ ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870