4 శాతం పెరిగిన ఎపి సొంత రాబడి
విజయవాడ : ఎపి(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం హయంలో క్రమంగా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆదాయ వృద్ధిపరంగా పుంజుకుంటుంది. ఈ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ఈ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతేడాది కన్నా మెరుగ్గా ఉందని అధికార యంత్రాంగం వెల్లడించి. ఏప్రిల్ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు మూడు త్రైమాసికాల్లో కలిపి కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్ర సొంత రాబడి 4శాతం పెరిగింది. రాష్ట్ర సొంత రాబడి డిసెంబరు నెలాఖరు వరకు కిందటి ఏడాది రూ.65,102 కోట్లు వస్తే ఈ సంవత్సరం రూ.67,409 కోట్లకు పెరిగింది.
Read Also: Andhra Pradesh: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు

ప్రత్యేక మార్జిన్‌తో కలిపి కిందటి ఏడాది రూ.71,097 కోట్లు(Andhra Pradesh) వస్తే ఈసారి రూ.74,163 కోట్ల మేర రాష్ట్ర సొంత రాబడిని సాధించారు. రాష్ట్ర సొంత రాబడిలో డిసెంబరులో మంచి ఫలితాలు వచ్చాయి. ఎనిమిది విభాగాల రాబడి కలిపి అక్టోబరులో రూ.8,203 కోట్లు, నవంబరులో రూ.8,334 కోట్లు, డిసెంబరులో రూ.8437 కోట్లు వచ్చింది. అక్టోబరులో దసరా, దీపావళి పండుగల దృష్ట్యా వ్యాపార కార్యకలాపాలు ఎక్కువ ఉంటాయని లక్ష్యం ఎక్కువగా ఉంది. ఆ లక్ష్యంతో పోలిస్తే 20శాతం రాబడి తగ్గింది. నవంబరులో లక్ష్యంతో పోలిస్తే 6శాతం రాబడి పెరిగింది.
డిసెంబరులో లక్ష్యం కన్నా 10శాతం అధికంగా రాబడి
కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా స్టాంపులు రిజిస్ట్రేషన్లు, గనుల శాఖల రాబడి అధికంగా ఉంది. రిజిస్ట్రేషన్ల విభాగంలో కిందటి ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో రూ.6,389 కోట్లు వస్తే ప్రస్తుతం రూ.8,082 కోట్లకు పెరిగింది. అంటే 26శాతం అధిక రాబడి వచ్చింది. గనుల రంగంలో గతేడాది రూ.1,648 కోట్ల రాబడి రాగా ఈ సంవత్సరం అది రూ.2,152 కోట్లకు అంటే 31 శాతం పెరిగింది. వాణిజ్య పన్నుల విభాగంలో కిందటి ఆర్థిక సంవత్సరం రూ.37,107 కోట్లు సాధిస్తే ఈసారి రూ.38,233 కోట్ల రాబడి వచ్చింది. 3శాతం మేర అదనపు రాబడి సాధ్యమైంది. ఎక్సైజ్ రాబడి తగ్గింది. కిందటి ఆర్థిక సంవత్సరం రూ.20,375 కోట్లు వస్తే ప్రస్తుతం అది రూ.19,868 కోట్లకే పరిమితమైంది. రాబడిలో తగ్గుదల 2శాతం ఉంది. వాహనాల పన్నుల రూపేణా ఆదాయం పెరిగింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.3,361 కోట్లు వస్తే ఈసారి రూ.3,558 కోట్లు వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: