हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Chhattisgarh: ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోట

Saritha
Chhattisgarh: ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోట

పోలీసుల ముందు 52మంది లొంగుబాటు..

జమ్మికుంట : భారతదేశంలో గత 50సంవత్సరాలుగా దక్షిణాది రాష్ట్రాలలో అనాటి పీపుల్స్ వార్ పార్టీ, నేటి మావోయిస్టు(Maoist) పార్టీ 8 రాష్ట్రాలలో పాలకప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాలను నడిపి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టి అంతర్గత భద్రతకు సవాల్ విసిరిన మావోయిస్టు కేంద్ర, రాష్ట్రాల కమిటీలు ఆపరేషన్ కగార్ అమలు చేయడంతో అతలాకుతలమైన (Chhattisgarh) చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కేంద్ర భద్రత బలగాలు ఆయా రాష్ట్రాల పోలీస్ బలగాలు దండకారణ్యాన్ని రెండు సంవత్సరాలుగా నలుదిక్కుల జల్లెడ పడుతుండడంతో సంవత్సరన్నర కాలంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆగ్రనాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులతో పాటు వందలాది మంది ఎదురుకాల్పుల్లో మృత్యువాత పడగా, సుమారు 1500మందికి పైగా ప్రభుత్వాల ముందు, పోలీసుల ముందు లొంగిపోయారు.

Read also: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇంకెంత కాలం విచారిస్తారన్న సుప్రీంకోర్టు

Chhattisgarh

కర్రగుట్టల నుంచి చెదిరిపోయిన మావోయిస్టులు

మావోయిస్టు కేంద్ర కమిటీ బలగాలకు చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని కర్రగుట్టలు భద్రత వలయంగా ఉండేవి. కర్రగుట్టలను పోలీసులు చుట్టు ముట్టడంతో చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్ల చెదురైన మావోయిస్టులు వారి మధ్యన సమాచార వ్యవస్థ లేక ఎదురుకాల్పుల్లో మృతిచెందేవారు మృతిచెందారు. ప్రభుత్వాలు పునరవాస పథకాలు ప్రకటించడంతో లొంగిపోయేవారు నేటికి ఇంక లొంగిపోతునే ఉన్నారు. ఆ దిశలో భాగంగానే గురువారం చత్తీస్ ఘడ్ (Chhattisgarh) రాష్ట్ర బీజాపూర్ ఎస్పి డాక్టర్ జితేందర్ కుమార్ యాదవ్ ఎదుట 52మంది మావోయిస్టు నక్సల్స్ ఆయుదాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 31మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన వారంత దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ ఎవోబి మ్రాఘర్ ఎరియా కమిటీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 49మంది నక్సల్స్పై కోటి 41 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు.

దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి భారీ దెబ్బ

సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన నాయకులు కాగా, ఎవోబి బామ్రాఘర్ ఎరియా కమిటీ మహారాష్ట్రకు చెందిన మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమంలో వీరంత లొంగిపోయినట్లు జిల్లా ఎస్పి జితేందర్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఇప్పటికి దండకారణ్యంలో అక్కడక్కడ మిగిలి పోయిన మావోయిస్టులు కాలంచెల్లిన సిద్దాం తాలతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా జనజీవన స్రవంతిలోకి రావాలని బీజాపూర్ ఎస్పి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా, చత్తీస్ఘడ్, ఆంధ్ర ప్రాంత సరిహద్దులో ఉన్న కర్రగుట్టల నుండి నేషనల్ పార్క్ వరకు చత్తీస్ ఘడ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతి పదికన రోడ్లు వేయడం నగమేరకు పూర్తి కావచ్చిందని, ఆ రోడ్డు పూర్తియితే దండ కారణ్యంలో చీమ చిటుక్కుమన్న పోలీసు బలగాలు ఆక్కడ చేరుకుంటాయని వెల్లడిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మావోయిస్టులపై ఆఖరి పోరుకు పోలీస్ ఆపరేషన్

మావోయిస్టులపై ఆఖరి పోరుకు పోలీస్ ఆపరేషన్

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన యూరోపియన్ దేశాలు

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన యూరోపియన్ దేశాలు

దావోస్ లో తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

దావోస్ లో తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

ఏఐ ప్రాసెసర్లపై 25 శాతం సుంకాలు వసూలు

ఏఐ ప్రాసెసర్లపై 25 శాతం సుంకాలు వసూలు

ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం.. అణు పరీక్షలపై అనుమానం?

ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం.. అణు పరీక్షలపై అనుమానం?

విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ మార్గాల్లోనే!

విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ మార్గాల్లోనే!

మేడారం ఆలయాన్ని 19న పునఃప్రారంభించనున్న సీఎం

మేడారం ఆలయాన్ని 19న పునఃప్రారంభించనున్న సీఎం

ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ లో CM రేవంత్ పర్యటన

ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ లో CM రేవంత్ పర్యటన

సుప్రీంకోర్టులో ‘జన నాయగన్’ మూవీ కు నిరాశ

సుప్రీంకోర్టులో ‘జన నాయగన్’ మూవీ కు నిరాశ

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

వేరే వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య!

వేరే వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య!

ఆన్‌లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్

ఆన్‌లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్

📢 For Advertisement Booking: 98481 12870