Spirit release date : పాన్ ఇండియా స్టార్ Prabhas నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘Spirit’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ప్రభాస్–సంచలన దర్శకుడు Sandeep Reddy Vanga కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది.
ఈ చిత్రాన్ని T-Series మరియు Bhadrakali Pictures సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా వ్యవహరిస్తున్నారు. హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాణ సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా రిలీజ్ డేట్‌ను షేర్ చేశారు.
Read also : West Godavari: రూ.1.53 కోట్లతో భారీ కోడిపందెం?
‘స్పిరిట్’ ఒక హైఓల్టేజ్ కాప్ యాక్షన్ డ్రామాగా (Spirit release date) తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ Tripti Dimri హీరోయిన్‌గా నటిస్తుండగా, Vivek Oberoi, Prakash Raj కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: