అరైవ్ అలైవ్’ నినాదం రక్షణాత్మకంగా డ్రైవ్ చేయడానికి అర్థమని అదనపు కలెక్టర్ నగేష్
అన్నారు. ప్రమాదాల నివారనే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాల దిశగా ముందుకు పోతుంది.
Read Also: Telangana: రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

అదనపు కలెక్టర్ నగేష్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి హాల్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో,అరైవ్ అలైవ్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ మహేందర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి,ఆర్డీవోలు మెదక్(Medak) రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూప్రాన్ జై చంద్రారెడ్డి, రూరల్ సీ.ఐ జార్జ్ తో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. కలెక్టరేట్ కార్యాలయ. అధికారులు ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా పేర్కొన్నారు.అరైవ్ అలైవ్’ రోడ్డు ప్రమాదాల(Medak) నివారణపై కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ నిబంధనలు ఉద్యోగులు పాటిస్తూ మరొకరికి ప్రచారం చేస్తూ స్ఫూర్తిగా నిలవాలన్నారు మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి వి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు. ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేసి ప్రమాదరహిత జిల్లాగా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు.ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: