హర్యానా రాష్ట్రం నార్నాల్ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రామ్నగర్ కాలనీలో నివసిస్తున్న శివకుమార్ (55) తన ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఛార్జింగ్ పెడుతుండగా బ్యాటరీ అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదంలో శివకుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లోనే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read also: Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!

భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన ఇల్లు
బ్యాటరీ పేలుడు తర్వాత మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదంగా మారాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లోని పెద్ద భాగం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే నష్టం భారీగా జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ-వాహనాల ఛార్జింగ్‌లో జాగ్రత్తలు అవసరం
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు కూడా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఛార్జింగ్ సమయంలో భద్రతా నిబంధనలు పాటించకపోతే ప్రాణహాని కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాణిత ఛార్జర్లు ఉపయోగించడం, వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఛార్జింగ్ పెట్టడం చాలా అవసరమని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: