ధనుష్(Dhanush) హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే మంచి స్పందన పొందింది. కథ, నటన, సంగీతం పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కూడా విజయవంతంగా నిలిచింది.
Read Also: Indian Cinema:పుష్ప 2’ తర్వాత తమిళ మార్కెట్‌పై అల్లు అర్జున్ ఫోకస్

జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం
ఈ సినిమా థియేటర్ రన్(Dhanush) ముగియడంతో, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల కోసం సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘తేరే ఇష్క్ మే’ జనవరి 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. ఈ వార్తతో థియేటర్లో చూడలేకపోయినవారు, అలాగే మరోసారి సినిమాను ఆస్వాదించాలనుకునే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధనుష్–కృతి సనన్ల కెమిస్ట్రీతో పాటు భావోద్వేగాలతో నిండిన కథాంశం, హృద్యమైన పాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఓటీటీ విడుదలతో ఈ చిత్రానికి మరింత విస్తృతమైన ప్రేక్షక లోకం చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: