భారత జట్టు పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుంది. 2025–26 రంజీ సీజన్‌లో తదుపరి రెండు మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా సిరాజ్ (Hyderabad Ranji Captain) ను నియమిస్తూ సెలెక్టర్లు బుధవారం అధికారికంగా జట్టును ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో విస్తృత అనుభవం కలిగిన సిరాజ్ నాయకత్వంలో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగనుండటంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read Also: ICC: వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానం
రాహుల్ సింగ్ స్థానంలో సిరాజ్
ఇప్పటివరకు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రాహుల్ సింగ్ స్థానంలో సిరాజ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. రాహుల్ సింగ్ ఇకపై జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవం ఉన్న సిరాజ్, రంజీల్లో జట్టును ముందుండి నడిపించడం వల్ల హైదరాబాద్‌కు మేలు జరుగుతుందని హెచ్‌సీఏ భావిస్తోంది.హైదరాబాద్ జట్టు గ్రూప్-డి లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. జట్టును నాకౌట్ దశకు చేర్చే లక్ష్యంతో సిరాజ్ బరిలోకి దిగనున్నాడు. జనవరి 22న ముంబైతో కీలక పోరు జరగనుంది. జనవరి 29న ఛత్తీస్‌గఢ్‌తో గ్రూప్ దశ చివరి మ్యాచ్ ఆడనున్నారు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ సిరాజ్ జట్టును నడిపించనున్నాడు.

హైదరాబాద్ రంజీ జట్టు: మహ్మద్ సిరాజ్ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), మిలింద్, తనయ్, రోహిత్ రాయుడు, హిమతేజ, వరుణ్ గౌడ్, అభిరథ్ రెడ్డి, రాహుల్ రాధేష్ (వికెట్‌కీపర్), అమన్ రావు, రక్షణ్ రెడ్డి, నితిన్ యాదవ్, నితీష్ రెడ్డి, ప్రజ్ఞయ్, పున్నయ్య.
స్టాండ్‌బై: మికిల్, అవినాష్ రావు, కార్తికేయ, ప్రణవ్, పి. నితీష్ రెడ్డి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: