
టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ చివరికి అధికారికంగా ఖరారైంది. అభిమానులు, సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు భోగి పండుగ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. #AA23 (AA 23 Announcement) అనే వర్కింగ్ టైటిల్‌తో విడుదల చేసిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Anaganaga Oka Raju Movie: ‘అనగనగా ఒక రాజు’- సినిమా ఎలా ఉందంటే?
కొంత విరామం
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
కథ ఇప్పటికే ఖరారైందని, స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని తెలుస్తోంది.ఇప్పటికే అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ కథానాయికలు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక బన్నీ కొంత విరామం తీసుకుని లోకేశ్ కనగరాజ్ సినిమా సెట్స్‌లో అడుగుపెడతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: