Healthy tips: చికెన్ స్కిన్‌లో ఉండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (UFAs) శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి, దీని ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇందులోని ప్రోటీన్, కొల్లాజెన్ కండరాల బలం, కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
Read Also: Health Tips: పైనాపిల్ తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

అయితే, చికెన్ స్కిన్‌లో కేలరీలు మరియు కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్‌ను ఎంపిక చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది, ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.
అలాగే చికెన్‌ను సరైన విధంగా ఉడికించి తీసుకోవడం ముఖ్యమని, ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన వంటకాలను వీలైనంతవరకు నివారించడం శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: