భోగి పండుగ సందర్భంగా సంప్రదాయంగా బంగారం, వెండి కొనుగోళ్లు(GoldPrice) ఎక్కువగా జరిగే సమయంలోనే ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు గణనీయంగా ఎగబాకి పండుగ కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి.
Read also: Today Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు

ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
తాజా రేట్ల ప్రకారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.1,000 పెరుగుదల నమోదై రూ.1,31,650కి చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర(GoldPrice) 10 గ్రాములకు రూ.1,090 పెరిగి రూ.1,43,620గా కొనసాగుతోంది. వెండి ధరల పెరుగుదల మరింతగా కనిపించింది. కేజీ వెండిపై ఏకంగా రూ.15,000 పెరగడంతో ప్రస్తుతం రూ.3,07,000 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల ఒడిదుడుకులు, డాలర్ మారకం విలువ, దేశీయ డిమాండ్ పెరగడం వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణాలుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఈ తాజా ధరలు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమానంగా అమల్లో ఉంటాయని బులియన్ మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి. ధరల పెరుగుదలతో పండుగ సమయంలో కొనుగోళ్లపై కొంతమంది వెనకడుగు వేయగా, మరికొందరు భవిష్యత్లో మరింత పెరుగుతాయనే అంచనాతో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: