చిన్న సేవింగ్స్‌తో పెద్ద రిటర్న్స్
Mutual Fund SIP: ఎక్కువ డబ్బు లేకపోయినా భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. దీనికి మంచి మార్గం మ్యూచువల్ ఫండ్ SIP. SIP అంటే ప్రతి రోజు లేదా ప్రతి నెల కొంత డబ్బు సేవ్ చేసి పెట్టుబడి పెట్టడం.
Read Also: UPI safety: పొరపాటున తప్పుడు ఐడీకి UPI ద్వారా డబ్బు పంపారా?

రోజుకు కేవలం రూ.100 లేదా రూ.200 పెట్టుబడి(Small Investment) పెట్టడం కూడా చాలుతుంది. ఉదాహరణకు, మీరు రోజుకు రూ.200 పెట్టుబడి పెడితే, అదే 14 సంవత్సరాలు కొనసాగిస్తే, సగటున సంవత్సరానికి 12% రాబడి వస్తే దాదాపు రూ.26 లక్షలు వరకు డబ్బు చేరవచ్చు.
SIP పెట్టుబడి విధానం
ఇదంతా ఒకేసారి రాదు. కానీ చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టడం వల్ల కంపౌండింగ్ శక్తితో డబ్బు నెమ్మదిగా పెరుగుతుంటుంది. మొదట తక్కువగా కనిపించినా, సంవత్సరాలు గడిచేకొద్దీ అది పెద్ద మొత్తంగా మారుతుంది.
మీ ఆదాయం పెరిగితే SIP మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు. అలా చేస్తే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. పిల్లల చదువు, ఇల్లు కొనడం, రిటైర్మెంట్ లాంటి లక్ష్యాలకు SIPలు చాలా ఉపయోగపడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: