Public safety: చైనా మాంజా(Chinese manja) అనేది సాధారణ గాలిపటాల దారానికి భిన్నంగా, గాజు పొడి, సగ్గుబియ్యం పేస్ట్, గంధకం వంటి రసాయనాలు మరియు వివిధ రంగులను కలిపి తయారు చేసిన ప్రమాదకరమైన దారం. ఇది సాధారణ దారంతో పోలిస్తే ఎంతో పదునుగా ఉండి, కత్తి అంచుల మాదిరిగా గాయాలు కలిగించే ప్రమాదం ఉంది.
Read also: Medak: పెద్ద శంకరంపేటలో ప్రజావాణి పాల్గొన్న జిల్లా కలెక్టర్

సాధారణ నూలు దారంతో గాలిపటాలను ఎగురవేయడం పెద్ద ప్రమాదం కాకపోయినా, చైనా మాంజా వాడకం మాత్రం తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తోంది. ఈ మాంజా కారణంగా పక్షులు తీవ్రంగా గాయపడటం, జంతువులు కోయబడటం, అలాగే ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు మెడ, చేతుల వద్ద గాయాలపాలవడం వంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి.
కొన్ని సందర్భాల్లో ఈ గాయాలు ప్రాణాపాయానికి కూడా దారి తీస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో మాంజా వినియోగం ఎక్కువగా ఉండటంతో రోడ్లపై ప్రయాణించే ప్రజలు, చిన్నపిల్లలు తీవ్ర ప్రమాదంలో పడుతున్నారు. పర్యావరణానికి, జీవజాలానికి హాని కలిగించే చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే చైనా మాంజాపై నిషేధ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు కొనసాగుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ, సురక్షితమైన నూలు దారాన్నే ఉపయోగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: