ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ(ali khamenei) నేతృత్వంలోని ప్రభుత్వం నిరసనకారులను అణచివేసేందుకు అత్యాధునిక సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. ఖమేనీ నిరకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాఉద్యమం బయటకు తెలియకుండా అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను ఇప్పటికే నిలిపివేసిన ప్రభుత్వం(Internet Ban in Iran), ఇప్పుడు ఎలోన్ మస్క్ ‘స్టార్‌లింక్'(starlink) సేవలను కూడా దూరం చేస్తోంది. ఇందుకోసం మిలిటరీ గ్రేడ్ జామర్లు, ‘కిల్ స్విచ్’ పరికరాలను వినియోగిస్తోంది. సాధారణంగా శాటిలైట్ ఇంటర్నెట్‌ను బ్లాక్(internet-bandh) చేయడం కష్టం. కానీ, ఇరాన్ (Iran) ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఈ ‘కిల్ స్విచ్’ టూల్..(Kill Switch Tool) స్టార్‌లింక్ శాటిలైట్ల నుండి వచ్చే సిగ్నల్స్‌ను పసిగట్టి, ఆ ఫ్రీక్వెన్సీలో అడ్డంకులు సృష్టిస్తుంది. దీనివల్ల స్టార్‌లింక్ టెర్మినల్స్ శాటిలైట్‌తో కనెక్ట్ అవ్వలేవు. ఫలితంగా ఇంటర్నెట్ పనిచేయడం ఆగిపోతుంది. నిపుణుల అంచనా ప్రకారం, ఇరాన్ ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే 80 శాతం మేర స్టార్‌లింక్ సేవలను జామర్ల సాయంతో అడ్డుకోగలుగుతోంది.
Read Also: Oslo: నోబెల్ మరొకరికి అంకితం చేయడం కుదరదు: కమిటీ

స్టార్‌లింక్ ఇంటర్నెట్ వాడాలంటే
ఎలోన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ అనేది అంతరిక్షం నుండి ఇంటర్నెట్‌ను అందించే టెక్నాలజీ. సాధారణంగా మనం వాడే ఇంటర్నెట్ భూమి అడుగున ఉండే కేబుల్స్ లేదా మొబైల్ టవర్ల ద్వారా వస్తుంది. కానీ స్టార్‌లింక్ నేరుగా ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుంది. సాధారణ శాటిలైట్ ఇంటర్నెట్ ఉపగ్రహాలు భూమికి సుమారు 35,000 కి.మీ. దూరంలో ఉంటాయి. దీనివల్ల సిగ్నల్ వెళ్లి రావడానికి సమయం పడుతుంది. కానీ స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూమికి కేవలం 550 కి.మీ. ఎత్తులో ఉంటాయి. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. సిగ్నల్ ఆలస్యం కాకుండా అందుతుంది. స్టార్‌లింక్ వేలాది చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇవి భూమి చుట్టూ ఓ వల లాగా అల్లుకుని ఉంటాయి. మీరు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు, మీ ఇంటి పైన ఉన్న ఏదో ఒక శాటిలైట్ మీ సిగ్నల్‌ను గ్రహించి ఇంటర్నెట్‌ను అందిస్తుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ వాడాలంటే మీ ఇంట్లో ఒక చిన్న శాటిలైట్ డిష్, ఒక రౌటర్ ఉండాలి. ఇది ఆకాశం వైపు తిరిగి ఉంటుంది. పైన తిరుగుతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ అందుకుంటుంది.
రంగంలోకి ట్రంప్, మస్క్
ఇరాన్(iran protest) పౌరులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆయన ఎలోన్ మస్క్‌తో మాట్లాడి, ఇరాన్ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను ఎలా అధిగమించాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. “ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది, వారిని డిజిటల్ చీకటిలోకి నెట్టడం ఆపాలి” అని ట్రంప్ హెచ్చరించారు. ఇంటర్నెట్ నిలిపివేయడంతో నిరసనలకు సంబంధించిన వీడియోలు, సమాచారం బయటి ప్రపంచానికి తెలియడం లేదు. అయినప్పటికీ, నిరసనకారులు వివిధ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇ
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: