Telangana : రాష్ట్రంలో ఈ యేడాది ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (FRS)ను అమలు చేయనున్నారు. ఇదే విధానాన్ని పరీక్షల అనంతరం నిర్వహించే ఇంటర్ మూల్యాంకనం (వాల్యూయేషన్)లోనూ అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్కు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్స్కి కూడా ఎస్ఆర్ఎస్ను అమలు చేయాలని నిర్ణయించారు.

అలాగే ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు, డిపార్ట్మెం టల్ ఆఫీసర్స్కి కూడా ఎస్ఆర్ఎస్ను అమలు చేయనున్నారు. ఎస్ఆర్ఎస్ను ప్రస్తుతానికి పరీక్షల సిబ్బందికి మాత్రమే అమలు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 సంవత్సరంలో విద్యార్థులకు కూడా అమలు చేసే యోచనలో వాల్యుయేషన్లోనూ అమలు చేయనున్న ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షలకు 1,495 కేంద్రాలు, ప్రాక్టికల్ పరీక్షలకు 1,924 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రిస్ట్వచ్లపై నిషేదం విధించనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో గోడ గడియారాలు ఏర్పాటు చేయను న్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఒక గోడ గడియారం అందుబాటులో ఉంచేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షలకు ఈ ఏడాది 50,984 మంది విద్యార్థులు దూరంకానున్నారు. వారంతా ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించ లేదు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసినందున.. వారు వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశం లేదు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 10,47,815 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వారిలో ఇప్పటి వరకు 9,96,831 విద్యార్థులు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించారు. దీంతో పరీక్ష ఫీజు చెల్లించని 50,984 మంది పరీక్షలకు హాజరయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్ పరీక్షలకు 1,924 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో జనరల్ విద్యార్థులకు 1,410 కేంద్రాలను, ఒకేషనల్ విద్యార్థులకు 484కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: