విజయవాడ : షిర్డీలోని సాయినాథుడ్ని మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి దర్శించుకున్నారు, సాయిబాబాకు నిర్వహించే కాగడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ దంపతులకు ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ (Nara lokesh) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం బాబాను ప్రార్థించినట్లు తెలిపారు. దక్షి ణ భారతదేశంలో సంక్రాంతి పండగ జరుగుతున్న నేపథ్యంలో ఆయన పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాయి బాబా సమాధిని దర్శనం చేసుకున్న తర్వాత, లోకేశ్ దంపతులు ద్వారకామాయి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ సాయిబాబా గురుస్థానాన్ని కూడా దర్శించుకుని, గురుస్థాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
Read also: Sankranti Celebrations : నారావారిపల్లెకు చేరుకున్న CM చంద్రబాబు

I prayed to Shirdi Sai for the welfare of the people
లోకేశ్ మాట్లాడుతూ, తాను మొదటిసారి శిర్డీకి వచ్చానన్నారు.
దర్శనం పూర్తి అయిన అనంతరం, సాయిబాబా సంస్థాన్ సీఈవో గోరక్ష్ గడిల్కర్ నారా లోకేశ్ కు శాలువా కప్పి సాయిబాబా హారతి విగ్రహాన్ని ఇచ్చి సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. మంత్రి లోకేశ్ వెంట ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ సాయిబాబా సంస్థాన్ సీఈఓ గోరక్ష్ గడిల్కర్ దక్షి దర్శనం కోసం ప్రతిరోజూ ఎంత మంది భక్తులు శిర్డీకి వస్తారు? సాయిబాబా సంస్థ వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది అనే పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ, తాను మొదటిసారి శిర్డీకి వచ్చానన్నారు. సాయిబాబా సమాధి దర్శనం చేసుకునే అదృష్టం తనకు కలిగిందని అన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: