Tirupati : వినియోగదారులు తమ సమస్యలను విన్నవిస్తే వాటిని పరిష్కరించడంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయరాదని, తక్షణం సమస్యలు పరిష్కరించేలా అధికారులు చూడాలని ఎస్పీడిసిఎల్ సిఎండి శివశంకర్(CMD Sivashankar) స్పష్టం చేశారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు (Grant of electricity connections), విద్యుత్ లైన్లు, ట్రాన్సా ఫార్మర్ల మార్పు, లోఓల్టేజ్ సమస్య, ట్రాన్సా ఫార్మర్ల సామర్థం పెంపు, విద్యుత్ స్తంభాల మార్పు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి సమస్యలను సంబంధిత అధికారులు తక్షణం పరిష్కరించి తనకు తెలియజేయాలన్నారు.
Read also: AP: మంత్రి లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం సోమవారం “డయల్ యువర్ ఎస్పిడిసిఎల్ సిఎండి” కార్యక్రమం తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి 63 సమస్యలు అందాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడవ, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన ఫోన్ ద్వారా వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వీలైనంత త్వరగా వాటిని వరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు: 1912, 1800 425 155333 కు కాల్ చేసి తెలియజేయవచ్చని కోరారు. ఇంకా 91333 31912కు వాట్సాప్నంబర్కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఈ తెలిపారు.
కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్,ఐటి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్ (టెక్నికల్ హెచ్ఐర్డి) 3. గురవయ్య, చీఫ్ వి. విజయన్, చక్రపాణి, సురేంద్రరావు, జనరల్ మేనేజర్లు పి. హెచ్. జానకి రామ్, జె. రమణా దేవి. ఆర్. పద్మ, ఎన్. శోభావాలెంటీనా, కె. ఆది శేషయ్య, యం. మురళీ కుమార్, యం. కృష్ణా రెడ్డి, జనరల్ మేనేజర్లు రామచంద్ర రావు, వెంకటరాజు, శ్రీకాంత్, భాస్కర్ రెడ్డి, జగదీష్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: