ఇంటిని శుభ్రంగా, పరిమళంగా(HomeCleaningTips) ఉంచుకోవడానికి ఖరీదైన రసాయనాల అవసరం లేదు. ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతోనే మంచి ఫలితాలు పొందవచ్చు.
కార్పెట్లపై పేరుకుపోయిన దుమ్ము, దుర్వాసన తొలగించాలంటే వెనిగర్, మొక్కజొన్న పిండి, నీటిని కలిపి కార్పెట్‌పై చల్లి కొద్దిసేపు ఉంచాలి. సుమారు ఐదు నిమిషాల తరువాత వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేస్తే కార్పెట్ తాజాగా మారుతుంది.
ఇంటి అంతటా మంచి సువాసన రావాలంటే కాఫీ పొడి, పుదీనా ఆకులు, బేకింగ్ సోడా, నిమ్మ తొక్కలను ఒక గిన్నెలో వేసి గది మూలలో ఉంచితే సరిపోతుంది. ఇవి దుర్వాసనను తొలగించి సహజ పరిమళాన్ని వ్యాప్తి చేస్తాయి.
కిచెన్‌లో గట్లు, టైల్స్, కిటికీ అద్దాలపై పేరుకుపోయే మురికి తొలగించేందుకు వెనిగర్, బేకింగ్ సోడా, నీటిని కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఈ ద్రావణాన్ని చల్లి అరగంట తరువాత తుడిచేస్తే మెరుపుతో పాటు శుభ్రత కూడా కనిపిస్తుంది
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: