ఐటీ రంగం(IT Sector)లో అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS Results) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ కాలంలో సంస్థ రూ.10,657 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 14 శాతం మేర తగ్గినట్లు కంపెనీ తెలిపింది.
Read also: US: పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

అయితే ఆదాయ పరంగా టీసీఎస్ మంచి వృద్ధిని కొనసాగించింది. ఈ త్రైమాసికంలో సంస్థ ఆదాయం 5 శాతం పెరిగి రూ.66,087 కోట్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పటికీ, కీలక రంగాల నుంచి వచ్చిన ఆర్డర్ల కారణంగా ఆదాయం పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా టీసీఎస్ షేర్ హోల్డర్లకు డబుల్ డివిడెండ్(Double dividend)ను ప్రకటించింది. మూడో మధ్యంతర డివిడెండ్‌గా ఒక్కో షేర్‌కు రూ.11, అలాగే ప్రత్యేక డివిడెండ్‌గా రూ.46 చొప్పున చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా షేర్ హోల్డర్లకు గణనీయమైన లాభం చేకూరనుంది. భవిష్యత్తులో స్థిరమైన వృద్ధి సాధించడంపై దృష్టి సారిస్తామని టీసీఎస్ యాజమాన్యం పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: