తెలంగాణ(Telangana) గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు.
Read also: Medak: పెద్ద శంకరంపేటలో ప్రజావాణి పాల్గొన్న జిల్లా కలెక్టర్
మేడారం మహాజాతరను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ ప్రచార సామగ్రిని సిద్ధం చేసినట్లు సీఎం పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశిష్టత ప్రతిబింబించేలా బ్రోచర్, పోస్టర్‌ను రూపొందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క, ఎమ్మెల్యే శ్రీ అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ శ్రీ బలరాం నాయక్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నట్లు రేవంత్ రెడ్డి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. జాతర విజయవంతానికి అందరూ పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం మహాజాతరను భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శించుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: