తాను అందుకున్న నోబెల్ శాంతి(Nobel Peace) పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అంకితం చేస్తానని అన్న.. మారియా కొరినా మచాడో మాటల్ని నోబెల్ శాంతి కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డును మరొక వ్యక్తితో పంచుకోలేం, రద్దు చేయలేం, బదిలీ చేయలేం.. అని నార్వేనియన్ నోబెల్ కమిటీ తాజాగా స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Also: Virat Kohli: అవార్డులన్నీ అమ్మకే అంకితం చేస్తా!

పురస్కార గ్రహీత పేరు ఒకసారి ప్రకటించాక.. ఇక అదెప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నది. తనకు అందిన ప్రైజ్ మనీ మొత్తాన్ని అవార్డు గ్రహీత ఎవరితోనైనా పంచుకోవచ్చునని తెలిపింది. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అవార్డు అందుకున్న తర్వాత వారు చెప్పే లేదా చేసే విషయాలపై సాధారణంగా స్పందించమని కమిటీ పేర్కొన్నది.
శాంతి బహుమతిపై ట్రంప్ మక్కువ
గతంలో కూడా తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిని అంటూ ట్రంప్ పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై చెప్పుకున్నారు. తాను రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన 8 నెలల్లోనే 8 యుద్ధాలను ముగించానని.. అందుకోసం తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన వాదించారు. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2009లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఏమీ చేయకపోయినా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారని ట్రంప్ విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: