విజయవాడ సింగ్ నగర్లో అత్తపై అల్లుడు కిరాతక దాడి
విజయవాడలోని సింగ్ నగర్లో చోటు చేసుకున్న దారుణ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ అల్లుడు తన అత్తను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన అందరిని షాక్‌కు గురి చేసింది. కుటుంబ కలహాలు చివరకు ప్రాణాలు తీసిన ఈ ఘటన నగరంలో ఆందోళన కలిగిస్తోంది.
Read also: Gandikota Utsavalu 2026: గండికోట ఉత్సవాల సందడి షురూ!

Vijayawada crime
భార్య విషయంలో ఏర్పడిన విభేదాలే హత్యకు కారణం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సింగ్ నగర్‌కు చెందిన కోలా దుర్గ కుమార్తెకు నాగసాయితో వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ గొడవల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తనతో కాపురానికి పంపించాలని నాగసాయి అత్త కోలా దుర్గను కోరగా, ఆమె అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన నాగసాయి కోపంతో అత్త ఇంటికి వెళ్లి కత్తితో ఆమెపై దాడి చేశాడు.
చికిత్స పొందుతూ మృతి.. నిందితుడు అరెస్ట్
ఈ దాడిలో కోలా దుర్గకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నాగసాయిని అదుపులోకి తీసుకున్నారు. అతడు స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగసాయిపై హత్య కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, గతంలోనే అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: