టెలికాం కంపెనీలు 2026లో మొబైల్ రీఛార్జ్ ధరలను (Recharge Prices) పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెలలోనే పెంపు ఉంటుందని అందరూ ఊహించారు. కానీ టెలికాం కంపెనీలు మరికొంత సమయం తీసుకోనున్నాయని తెలుస్తోంది. 2024లో రీఛార్జ్ ధరలను భారీగా పెంచగా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ సారి భారీగా పెరగనున్నాయని సమాచారం. 5జీ విస్తరణ, ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు టెలికాం కంపెనీలకు భారమవుతుంది. దీంతో ప్రయాణికులపై భారం వేసేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి.
Read also: Online Food: జొమాటోలో రెట్టింపు ధరలు? వైరల్ అవుతున్న పోస్ట్

టెలికాం కంపెనీలకు కూడా ఆదాయం
జూన్లో రీఛార్జ్ ధరలను (Recharge Prices) పెంచనున్నాయని ఆర్ధిక సేవల సంస్థ జెఫ్రీస్ తన రిపోర్టులో పేర్కొంది. ఏకంగా 15 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. త్వరలో జియో పబ్లిక్ ఐపీఓకు లిస్ట్ కానుంది. భారీగా నిధులు సమీకరించనుండగా.. దేశంలోనే ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఐపీఓకు చెబుతున్నారు. దీని వల్ల టెలికాం రంగంలో మార్కెట్ వాల్యూయేషన్ పెరుగుతుందని జెఫ్రీస్ సంస్థ తన నివేదికలో పొందుపర్చింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో టెలికాం రంగం ఆదాయ వృద్ధి 16 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇక పోస్ట్ పెయిడ్, డేటా వినియోగం కూడా పెరగడంతో టెలికాం కంపెనీలకు కూడా ఆదాయం పెరుగుతున్నట్లు పేర్కొంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: