మేడారం (Medaram) జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. జాతరకు వచ్చే ప్రతి భక్తికి సకాలంలో వైద్యం అందేలా అన్ని ప్రధాన రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి రాజనర్సింహ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేపట్టారు.
Read also: Bus Charges: సంక్రాంతి రద్దీ.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏపీ సర్కార్ హెచ్చరిక

Medical security for the Medaram Jathara
30 మెడికల్ క్యాంపులు, 50 పడకల ప్రధాన ఆస్పత్రి
జాతర ప్రాంగణంలోని TTD కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అదనంగా మరో రెండు ప్రాంతాల్లో మినీ ఆస్పత్రులు అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 30 మెడికల్ క్యాంపులు, 35 అంబులెన్సులు సిద్ధంగా ఉండగా, 3,199 మంది వైద్య సిబ్బంది సేవలు అందించనున్నారు. జ్వరాలు, గాయాలు, నీరసం వంటి సాధారణ సమస్యల నుంచి అత్యవసర చికిత్సల వరకూ అన్ని రకాల వైద్య సేవలు అందించేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: