ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో క్రెడిట్ కార్డులు(Credit cards) వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థలో కీలక సాధనంగా మారాయి. అయితే, ఉపయోగంలో లేని క్రెడిట్ కార్డులను మూసివేస్తే ఆర్థికంగా మేలు జరుగుతుందనుకోవడం చాలా సందర్భాల్లో తప్పు అవుతుంది. ఫైనాన్స్ నిపుణుల ప్రకారం, ఇలా చేయడం వల్ల CIBIL స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్
క్రెడిట్ కార్డును పూర్తిగా క్లోజ్ చేస్తే మీ మొత్తం క్రెడిట్ పరిమితి తగ్గిపోతుంది. దీంతో మీరు వినియోగిస్తున్న రుణ మొత్తానికి, అందుబాటులో ఉన్న పరిమితికి మధ్య నిష్పత్తి (Credit Utilisation Ratio) పెరుగుతుంది. ఈ నిష్పత్తి పెరగడం అంటే రుణంపై ఆధారపడటం ఎక్కువగా ఉన్నట్లు క్రెడిట్ బ్యూరోలు భావిస్తాయి. ఫలితంగా CIBIL స్కోర్ తగ్గే ప్రమాదం ఉంటుంది.

అంతేకాదు, చాలాకాలంగా ఉన్న కార్డును మూసివేయడం వల్ల మీ క్రెడిట్ చరిత్ర కాలవ్యవధి తగ్గిపోతుంది. ఇది కూడా స్కోర్‌పై ప్రతికూలంగా ప్రభావం చూపే అంశమే. అలాగే, క్రెడిట్ కార్డులు, లోన్లు వంటి విభిన్న రుణ పద్ధతులు ఉండడం (Credit Mix) స్కోర్‌కు మేలు చేస్తాయి. కార్డును మూసివేస్తే ఈ వైవిధ్యం తగ్గి, స్కోర్‌పై దుష్ప్రభావం చూపుతుంది.
నిపుణుల సూచనలు
ఆర్థిక నిపుణులు వార్షిక ఫీజు లేని క్రెడిట్ కార్డులను పూర్తిగా మూసివేయకుండా, అప్పుడప్పుడూ చిన్న మొత్తాల లావాదేవీలకు ఉపయోగించి, సమయానికి బిల్లు చెల్లించాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే కార్డు యాక్టివ్‌గా ఉంటుంది, అలాగే క్రెడిట్ స్కోర్ కూడా మెరుగ్గా కొనసాగుతుంది.
అయితే, అధిక వార్షిక రుసుములు ఉండే లేదా అవసరం లేని అదనపు ప్రయోజనాలు లేని కార్డుల విషయంలో మాత్రం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే కార్డును డౌన్‌గ్రేడ్ చేయడం లేదా లిమిట్‌ను తగ్గించుకోవడం వంటి మార్గాలు కూడా పరిశీలించవచ్చు.
మొత్తానికి, క్రెడిట్ కార్డులను మూసివేయే ముందు దాని ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం ఆర్థికంగా శ్రేయస్కరం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: