భారత స్వేచ్ఛ కోసం అనేక మంది తమ జీవితాలను అర్పించారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(AjitDoval) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమంలో ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడారు.
Read Also: SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. పెరిగిన ఏటీఎం ఛార్జీలు

భద్రత విషయంలో గతంలో జరిగిన నిర్లక్ష్యం
దేశ చరిత్రను అధ్యయనం చేస్తే యువతకు విలువైన పాఠాలు లభిస్తాయని దోవల్(AjitDoval) అన్నారు. భారత్ ఎప్పుడూ ఇతర దేశాలపై దాడులు చేయలేదని, అయితే తమ స్వంత భద్రతపై గతంలో సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల నష్టాలు ఎదురయ్యాయని వ్యాఖ్యానించారు.
గతంలో ఎదురైన అన్యాయాలు, నష్టాల నుంచి పాఠాలు తీసుకుని, బలమైన భద్రతతో పాటు స్వాభిమానాన్ని ప్రతిబింబించే భారతదేశాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని యువతకు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారి పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: