Rayachoti Road Accident: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లాజిస్టిక్ లారీ, ద్విచక్రవాహనం ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రధాన రహదారిని నిర్లక్ష్యంగా దాటేందుకు యత్నించిన సమయంలో వేగంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Read Also: Telangana: దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్

ఢీకొట్టిన అనంతరం బైక్ లారీకి ఇరుక్కొని మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. లారీలో పెద్ద సంఖ్యలో బ్యాటరీలు లోడ్(Battery Lorry) అయి ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొద్దిసేపు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: