చంద్రగిరి నియోజకవర్గం సంబంధించిన రెవెన్యూ క్లినిక్ ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమీషనర్ మౌర్య తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్..
రెవెన్యూ క్లినిక్ లో వచ్చిన అర్జీలను సీరియస్ గా తీసుకోవాలి.
భూ సమస్యల పరిష్కార దిశగా.. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ కు శ్రీకారం చుట్టిందని, రెవెన్యూ క్లినిక్ లో వచ్చిన ప్రతి అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి సత్వరమే రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్(Dr. S Venkateswar) ఆదేశించారు. గురువారం తిరుపతి (Tirupati) కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఏర్పాటు చేసిన చంద్రగిరి నియోజకవర్గ పరిధి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమీషనర్ మౌర్య జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు, తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, రోజ్మండ్, తహశీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఆస్పత్రులు ఉన్నట్టే . . భూముల సమస్య పరిష్కారానికి కూడా రెవెన్యూ క్లినిక్ పేరుతో సరికొత్త వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనీ తెలిపారు. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో గత 18 నెలల కాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38 వేల అర్జీలు ప్రజా సమస్యల పరిష్కారానికి అందాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీదారుడు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని, పరిష్కరించగలిన సమస్యలను నిర్దేశిత కాలం లోపు పరిష్కరించాలని తెలిపారు.

Read also: AP Govt: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ‘ఛాయ్ రస్తా’ పథకం
పరిష్కరించలేని అర్జీలకు సంబంధించి కారణాలను అర్జీదారులకు వివరంగా తెలపాలన్నారు. రెవెన్యూ క్లినిక్ కు ఒకసారి అర్జీ అందితే, పరిష్కరించగలిన అర్జీని పరిష్కరించాలని, సిబ్బంది పరిష్కరించకపోవడం కారణంగా మరోసారి రెవెన్యూ క్లినిక్ కు అదే అర్జీ వస్తే సదరు సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రీసర్వే, ఇతర కారణాలు, క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేకపోవడం వలన అర్జీదారుల భూ సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుందని అన్నారు. జిల్లాలో చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో అత్యధిక శాతం రెవెన్యూ సంబంధించిన అర్జీలు రావడం జరుగుతుందని తెలిపారు. రీసర్వే, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు ప్రతి రోజు క్షేత స్థాయిలో మానిటరింగ్ చేసి, జాప్యంగా చేయకుండా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలన్నారు.
Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు
1. రెవెన్యూ క్లినిక్ కు వచ్చిన రైతులను (అర్జీదారులు) యొక్క భూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
2. ప్రతి మండలం కు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీదారుల అర్జీలను ఏ సమయం వరకు వారికి ఎలా పరిష్కరిస్తారో తెలియజేయాలని తెలిపారు.
3. రెవెన్యూ క్లినిక్ లో ప్రతి మండలానికి సంబంధించిన రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి రెవెన్యూ క్లినిక్ లో వచ్చే ఆర్జీలను స్వయంగా పరిశీలిస్తూ.. ఎలా పరిష్కరించాలి అనే విషయాలపై వివరంగా వివరిస్తూ పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
4. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రత్యేక డెస్క్ లు..
5. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయం సేవ పోర్టల్ కౌంటర్ ఆన్లైన్ సర్వీస్, అర్జీల స్వీకరణ జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు..
తదుపరి జిల్లా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్(Revenue Clinic) కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.. ఈ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ సంబంధించిన అన్ని మండలాల తాసిల్దారులు, ఆర్ ఐ లు, వీఆర్వోలు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: