అమెరికా(America)లో మన భారతీయులు చాలా రంగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్న సంగతి తెలిసిందే. డాక్టర్లు, ఇంజినీర్లు, బిజినెస్‌మెన్‌లు, లాయర్లు, రాజకీయ రంగంలో రాణిస్తున్న వారు అనేకం ఉన్నారు. భారత్ నుంచి అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడి ఉన్నవారు కొందరు అయితే.. వలసదారుల పిల్లలుగా ఉండి భారత మూలాలు ఉన్న వారు మరికొందరు ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో మహిళ.. అమెరికాలో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. న్యూజెర్సీ నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళగా డాక్టర్ టీనా షా నిలవనున్నారు. ఒక డాక్టర్‌గా.. వైద్య రంగాన్ని పీడిస్తున్న సమస్యలను పరిష్కరించాలని.. ముఖ్యంగా పేదల ఆరోగ్య పథకాలకు నిధులు తగ్గించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Read Also: USA: భారీగా కొకైన్ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్టు

వైట్ హౌస్ ఫెలోగా పనిచేసిన అనుభవం
టీనా షా తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఆమె ఇంటర్నల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, క్రిటికల్ కేర్ మెడిసిన్‌లో ట్రిపుల్ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్. టీనా షా ఒక ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణురాలు. ప్రస్తుతం ఆమె RWJBarnabas Healthలో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ టీనా షా అమెరికాలోని మూడు ప్రభుత్వ యంత్రాంగాల్లో (ఒబామా, ట్రంప్, బైడెన్) పాలసీ రోల్స్ పోషించారు. యూఎస్ సర్జన్ జనరల్‌కు సీనియర్ సలహాదారుగా, వైట్ హౌస్ ఫెలోగా కూడా ఆమెకు పనిచేసిన అనుభవం ఉంది. డాక్టర్ టీనా షా.. పెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్.. జెఫర్సన్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మెడికల్ డిగ్రీ.. చికాగో విశ్వవిద్యాలయంలో పల్మనరీ, క్రిటికల్ కేర్ ఫెలోషిప్‌ను పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
రూ. 9 కోట్ల నిధులను సేకరించి రికార్డు
రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అంటే ఏడాది లోపే డాక్టర్ టీనా షా.. 1 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 9 కోట్ల నిధులను సేకరించి రికార్డు సృష్టించారు. న్యూజెర్సీ 7వ డిస్ట్రిక్ట్ చరిత్రలో ఇంత వేగంగా ఈ మైలురాయిని దాటిన మొట్ట మొదటి డెమోక్రాట్ డాక్టర్ టీనా షా కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , టామ్ కీన్ జూనియర్ ప్రతిపాదించిన మెడికేడ్ నిధుల కోతలను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని డాక్టర్ టీనా షా ప్రకటించారు. ఈ కోతలు బిలియనీర్లకు పన్ను మినహాయింపులు ఇచ్చి.. సామాన్యుల వైద్య సదుపాయాలను దెబ్బతీస్తాయని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అ
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: