ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన పాలకవర్గ సభ్యులు
పంచాయతీ కార్యదర్శి (TG) అందుబాటులో ఉండడం లేదని చిన్నశంకరంపేట(Chinnasankaram) మండల పరిధి ధర్పల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు గ్రామంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని తెలిపారు. (TG) గ్రామ కార్యదర్శి చేసిన అక్రమాలపై విచారణ చేపట్టాలని ఈ మేరకు గురువారం ఎంపీడీవో దామోదర్ కు ఫిర్యాదు చేశారు. ధర్పల్లి సర్పంచ్ మానస, ఉప సర్పంచ్ మహేందర్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read also: TG: సర్కార్ కీలక నిర్ణయం.. ధరణి పోర్టల్ డెడ్‌లైన్ పొడిగింపు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: