ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, పశ్చిమ కనుమల పరిరక్షణ యోధుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాధవ్ గాడ్గిల్ (83) (Madhav Gadgil) బుధవారం రాత్రి పూణెలో తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు..పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ఆయన విశేష కృషి చేశారు.
Read Also: West Bengal: ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

పర్యావరణ పరిరక్షణకు ఆయన ఎనలేని కృషి
2023లో “ఎ వాక్ అప్ ది హిల్ లివింగ్ విత్ పీపుల్ అండ్ నేచర్” అనే పేరుతో గాడ్డిల్ ఆత్మకథను రాశారు. ఆయన గతంలో ప్రధాన మంత్రి సైంటిఫిక్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పశ్చిమకనుల ఎకాలజీని అధ్యయనం చేసేందుకు వేసిన నిపుణుల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు.గార్గిల్ 1942 మే 24న పుణే లో జన్మించారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యాన్ని కలిగిన పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు ఆయన ఎనలేని కృషి చేశారు.
అభివృద్ధి పేరిట అక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై అలుపెరగని పోరాటం చేశారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికిగానూ 2024 ఏడాదికి సంబంధించి ఐక్యరాజ్యసమితి (ఐరాస) అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్’ ఆయనకు వరించింది. ఇప్పుడు ఆయన మృతితో దేశ పర్యావరణ రంగంలో ఓ శకం ముగిసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: