Khammam Road Accident: ఖమ్మం జిల్లా వైరా మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉండే వడ్డాది రాము, వెంకటరత్నం దంపతులు ఈ ప్రమాదానికి బలయ్యారు.
Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు

సోమవారం రాము తన భార్య వెంకటరత్నాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట నుంచి ట్రాలీ ఆటోలో స్వగృహానికి తీసుకువస్తుండగా, సోమవరం గ్రామం సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు(Severe injuries) కావడంతో, సంఘటనా స్థలంలోనే వారు మృతిచెందినట్లు సమాచారం.
ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సాధించిన రోజులకే విషాదాంతం
ఈ ప్రమాద వార్తతో టీచర్స్ కాలనీతో పాటు వైరా ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవలే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించిన వెంకటరత్నం మరణం కుటుంబసభ్యులను, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచింది. సంతోషంగా జీవితం మొదలవుతుందనుకున్న సమయంలోనే ఈ దారుణ ఘటన జరగడం స్థానికులను కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: