
యువ నటుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒక రాజు’. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్.. ఆ తర్వాత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి, థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ జోడిగా సక్సెస్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది.
Read Also: Sankranthi Movies: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’ సినిమా?
అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం నేడు (జనవరి 8న) అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) మరోసారి బాక్సాఫీస్ వద్ద తన కామెడీ పవర్‌ను పక్కాగా చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా కింగ్ అక్కినేని నాగార్జున ఈ ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ అందించడం ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి.
రాజు గారి కోసం బంగార్రాజు రంగంలోకి దిగారు అన్నట్లుగా సాగిన ఆయన బేస్ వాయిస్ ట్రైలర్‌కు మరింత జోష్‌ను అదనపు ఆకర్షణను ఇచ్చింది. గోదావరి జిల్లా నేపథ్యంలో, పెళ్లి చుట్టూ తిరిగే గందరగోళం, హుషారైన డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ఇందులో నవీన్ ఎనర్జీకి తోడు, హీరోయిన్ మీనాక్షి చౌదరి అందం కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: