ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు.. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వివాదాస్పద హెచ్చరికలు చేసారు.. “పవన్ కల్యాణ్ జాగ్రత్త. నేను ఒక్క ప్రార్థన చేస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిలా చనిపోతావు” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.నిన్న హైదరాబాద్, అమీర్‌పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Read also: AP: ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నా
ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు గద్దర్‌ది సహజ మరణం కాదని, ఆయన్ను చంపేశారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే వెనిజువెలా అధ్యక్షుడిని అమెరికా కిడ్నాప్ చేయిస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని పాల్ ప్రశ్నించారు. తాను ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నానని, మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా అమెరికాలో చర్చలు జరిపినట్లు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: