हिन्दी | Epaper

Medak News : మెదక్‌లో మెడికల్ అసోసియేషన్ నూతన భవనానికి భూమిపూజ , ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

Sai Kiran
Medak News : మెదక్‌లో మెడికల్ అసోసియేషన్ నూతన భవనానికి భూమిపూజ , ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

Medak News : మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న మెదక్ జిల్లా మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Medak News) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్యుల కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?

మెడికల్ అసోసియేషన్‌కు స్వంత భవనం ఉండటం ద్వారా వైద్యుల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ భవనం వైద్యులకే కాకుండా మెదక్ జిల్లావాసులకు కూడా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, జిల్లా మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మండల కాంగ్రెస్ నాయకులు, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

📢 For Advertisement Booking: 98481 12870