అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) కు పదవీ భయం పట్టుకుంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలవకపోతే తాను అభిశంసనకు గురి అవుతానని భావిస్తోన్నారు. ఇదే విషయాన్ని రిపబ్లికన్లతో నిర్వహించిన సమావేశంలోనూ స్పష్టం చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో గెలవకపోతే తన అభిశంసన తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, యూఎస్ కాంగ్రెస్ కు జరిగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాలను దక్కించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. వాషింగ్టన్‌లో జరిగిన హౌస్ రిపబ్లికన్ ఎంపీల రిట్రీట్ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. నవంబర్ లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో తప్పక గెలవాలని, అలా జరక్కపోతే డెమోక్రాట్లు ఏదో ఒక కారణాన్ని వెదికి తనను అభిశంసిస్తారని తేల్చి చెప్పారు. యూస్ కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు బలహీనపడకూడదని, ఈ అవకాశం కోసమే డెమోక్రాట్లు ఎదురు చూస్తోన్నారని పేర్కొన్నారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో గెలవకపోతే కొన్ని అజెండాలు అర్ధాంతరంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు.
Read Also: Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్

హౌస్ లో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీ స్వల్పమే
డెమోక్రాట్లకు కాంగ్రెస్‌లో ఆధిక్యం దక్కితే, తనను అభిశంసన ప్రక్రియను ప్రారంభించే అధికారం వారికి లభిస్తుందని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఈ నవంబర్ లో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మొత్తం 435 సీట్లకు, సెనేట్‌లో 100లో మూడింట ఒక వంతు సీట్లకు వచ్చే నవంబర్ లో పోలింగ్ జరగనుంది. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, కాంగ్రెస్ పై పట్టు నిలుపుకోవడం పార్టీకి అత్యంత ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం- హౌస్ లో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీ స్వల్పమే. అమెరికా చట్టం ప్రకారం దేశద్రోహం, లంచం, లేదా ఇతర తీవ్రమైన నేరాలు, దుష్ప్రవర్తన వంటి ఆరోపణలపై అధ్యక్షుడిని అభిశంసించే సర్వాధికారాలు హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఉంది. మూడింట రెండు వంతుల ఓట్లతో ఆయన్ను దోషిగా నిర్ధారించి, పదవి నుంచి తొలగించవచ్చు. నవంబర్‌లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలు, సెనేట్‌లోని 33 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: