हिन्दी | Epaper

America: వెనిజులాకు నేనే ‘అధికారి’: ట్రంప్

Rajitha
America: వెనిజులాకు నేనే ‘అధికారి’: ట్రంప్

గత శనివారం తెల్లవారుజామున అమెరికా అకస్మాత్తుగా వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. చమురు, ఎన్నికలు, ఇన్ఛార్జ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్ ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు. ఎన్ బీసీ న్యూస్ తో ట్రంప్ మాట్లాడుతూ వెనిజులాకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించగా..ఒకే మాటలో ‘నేనే’ అన్నారు. ఇక వెనిజులాపై అమెరికా యుద్ధం చేయడం లేదని తెలిపారు. అలాగే సమీప భవిష్యత్తులో ఎన్నికలు కూడా నిర్వహించబోమని తేల్చిచెప్పారు. దక్షిణ అమెరికా దేశాన్ని చక్క దిద్దడమే కర్తవ్యం అన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలని ట్రంప్ పేర్కొన్నారు.

Read also: Layoffs: పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్

I am the 'authority' in Venezuela

I am the ‘authority’ in Venezuela

ఆరోగ్య వెనిజులా కోసం పాటుపడతాం: ట్రంప్

మొట్టమొదటిగా వెనిజులాను ఆరోగ్యంగా మార్చాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18నెలల కన్నా తక్కువ సమయం పట్టవచ్చని వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా సబ్సిడీ ఇవ్వొచ్చని తెలిపారు. చమురుకంపెనీలు ఖర్చులను భరించి పెట్టుబడులు తిరిగి పొందుతాయని చెప్పారు. ‘చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చమురు కంపెనీలు దానిని కర్చు చేస్తాయి’ అని ట్రంప్ అన్నారు. ఇక వెనిజులాతో యుద్ధం ఉండదని కేవలం మాదక ద్రవ్యాలు అమ్మే వ్యక్తులతోనే ఉంటుందని స్పష్టం చేశారు. వెనిజులా నేరాలతో నిండిపోయిందని, అస్థిరతను ఎగుమతి చేస్తోందని ఆరోపించారు. ఇక తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతు స్వీకరించిన డెల్సీ రోడ్రిగ్జె తో అమెరికా సంబంధాలు కొనసాగిస్తుందా? అన్న దానిపై కూడా వివరణ ఇచ్చారు.

ఆమెతో ఎటువంటి కమ్యూనికేషన్ లేదని తేల్చి చెప్పారు. ఆమెపై ఆంక్షలు కొనసాగుతాయా? లేదా అనేది త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. అప్పటి వరకు వెనిజులాకు ఇన్ఛార్జ్ గా నేనే ఉంటానని ట్రంప్ (Donald trump) తేల్చి చెప్పారు. అంతేకాక తమను ఎదిరించే లాటిన్ దేశాలకు కూడా వెనిజులా గతే పడుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కారణంగా చూపుతూ మెక్సికో, క్యూబా, కొలంబియా వంటి దేశాలను టార్గెట్ చేశారు. మీరు వైఖరి మార్చుకోకపోతే వెనిజులాకు ఎదురైన పరిస్థితే తప్పదని వార్నింగ్ ఇవ్వడంతో భౌగోళిక ఉద్రిక్తలు ఒక్కసారిగా పెరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870