రేపోమాపో మాయమవుతాయనుకున్న ఆరావళీ పర్వత పంక్తులకు ఇప్పుడు బోలెడంత రక్షణ దొరుకుతోంది. గుట్టలు తవ్వడమంటే మామూలే. పర్వతాలను కూడా తవ్వేసుకునే తిమింగళాలున్నాయంటే కాస్త సరిపెట్టుకోవచ్చు. అవి చదునైతే జీవ జాతులు బతుకుతాయనీ సర్దేసుకోవచ్చు. గుట్టలు మింగే బకాసురుల వలన ప్రభుత్వ ఖజానాకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. వాటిని ఏలిన వారు చూసుకుంటారులే అని సరిపెట్టుకునేలా విషయం లేదు. ఇప్పుడా ఏలిన వారి నుంచే చరిత్ర ప్రసిద్ధి కలిగిన ఆరావళీ పర్వతాలకు ముప్పు ఏర్పడింది. గగ్గోలు పెట్టాక కేంద్రమే కాస్త తగ్గి ఇకపై ఆరావళీ పర్వతాలు (aravali hills )తవ్వుకునేందుకు అనుమతించ బోమని గద్గద స్వరంతో ప్రజలకు విజ్ఞప్తిని జారీచేశారు. గతంలోనే వాటిని యధేచ్ఛగా కాకపోయినా కొంత ప్రాం తాన్ని మైనింగ్కిచ్చేసింది. ఇది మునుపటి మాట. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఆరావళీ పర్వతాలు ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు దాదాపు 700 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తొలుత కొత్త నిర్వ చనాన్ని చెప్పగా విపక్షాలు వ్యతిరేకించాయి. కేవలంవంద మీటర్ల ఎత్తు ఉన్నవి మాత్రమే ఆరావళీ పర్వతపంక్తుల లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కేంద్రం ఇచ్చిన ఈ నిర్వచనాన్ని జనం ఎండగట్టారు. నిజానికి అక్కడ విచ్చలవిడిగా జరుగుతున్న మైనింగ్, రియాల్టీ కార్యకలాపాల కారణంగా ఆ పర్వతాల ఉనికికే భంగం వాటిల్లింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆ ప్రాచీన పర్వతాల శ్రేణులను విశ్లేషించి నిర్వ చించిందో కానీ దాదాపు ఆ పర్వతశ్రేణులు ఎప్పటికైనా కనుమరుగవుతాయని, వాటివల్ల పర్యావరణం బాగా దెబ్బ తింటుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. మైనింగ్ అక్రమాలను అడ్డుకోవాల్సిన కేంద్రప్రభుత్వం తన బాధ్యతను మరచిపోయిందో ఏమోకానీ ఆరావళీ పర్వతాల (aravali hills)భౌగోళిక స్వరూపాన్నే మార్చచూసింది. దాంతో పర్యావరణవేత్తలు, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆఖరికి కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కూడా ప్రభుత్వం అలా చేయకుండా ఉండాల్సిందంటూ నిరసన వ్యక్తంచేశారు. ఆరావళీ నిలువునా అడవులు, నీటివనరులు ప్రఖ్యాతి చెందిన రాజస్థాన్ల శిధిలాలు, చారిత్రక ప్రదే శాలు, దేవాలయాలున్నాయి. అంతే ప్రాధాన్యత ఉన్న అరుదైన ఖనిజాలు కూడా ఈ పర్వతాల మాటున దాగి ఉన్నాయి. రాగి, జింక్, జిప్సమ్, క్వార్ట్, పాలరాయి, రాక్సల్పేట్ వంటి వన్నీ ఇందులోదాగిఉన్నాయి. దీన్ని హస్తగతం చేసుకోవాలని ఎదురు చూస్తున్న మైనింగ్ మాఫియాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కదిలిరాలేదు. పైగా ఆరావళీ పర్వతాలను పరిధిని కుదిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ సుప్రీంకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం 100 మీటర్లకంటే లోపు ఎత్తు ఉన్న పర్వతాలను ఆరావళీ పరిధి నుంచి మినహాయింపు కోరింది. ఈ లేఖ సారాంశంపై సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్ట్ కమిటీ ఈ ప్రతిపాదన ఆమోదించ లేదు. ఇదే నిర్ణయాన్ని నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు దాఖలుపరచగా దాదాపు ఆమోదించింది. అయితే సైంటి ఫిక్ మ్యాపింగ్ పూర్తయ్యేదాక ఎటువంటి కొత్త లీజులు ఇవ్వరాదని షరతు పెట్టింది. ఫారెస్టుసర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం ఆరావళిలోని మొత్తం 12,081 పర్వతాల్లో1.048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను బట్టి ఆరావళీ పర్వతశ్రేణుల్లో 90 శాతం మైనింగ్‌కు అనుకూల పరిధిలోకి మారతాయి. దాంతో ఆ పర్వతాలు పిండవుతాయి. బోలెడంత ఖనిస సంపద దళారుల పాలవుతుంది. ఈవిధమైన అంచనాలతో పర్వతాల లో పది శాతం మాత్రమే పర్వతాలుగా పనికివస్తాయి. గతంలో 1975-2019 వరకు జరిగిన అక్రమ మైనింగ్ వలన ఇప్పటికే 8శాతం మేరకు ఆరావళీ మైనింగ్ తరలి వెళ్లిపోయింది. దాదాపు కనుమరుగైనట్లే. తాజాగా కేంద్రం ఇచ్చిన ప్రతిపాదనలలో ఆరావళీ మరింత కుదించుకుపో తాయి. అంతేకాదు ఈ పర్వతశ్రేణుల వైశాల్యం తగ్గిపోయే కొద్దీ ఢిల్లీ, తదితర మహానగరాలకు నష్టం కలుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క థార్ ఎడారి నుంచి వచ్చే ఇసుక తుఫానులు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ వైపు పయనించకుండా ఆరావళీ పర్వతాలే రక్షణ గోడ లుగా కాపాడుతున్నాయి. అందుకే ఢిల్లీ (ఎన్ సిఆర్) వంటి జనాభా ఎక్కువగా ఉన్న నగరాలకు ఇసుక రేణువులు తోడైతే అక్కడ ఆప్రాంతంలో బతికే పరిస్థితి మృగ్యమవు తోంది. ఈ పర్వతాలను స్వచ్ఛమైన గాలిని అందించే ఊపిరితిత్తులుగా ‘గ్రీన్ లంగ్స్’గా పిలవడం కద్దు. ఈ పర్వతాలపై ఉండే దట్టమైన అడవులు రాళ్లు, భూగర్భ జలాల పెంపుతోపాటు వరదలను ఆపగలుగుతున్నాయి. ఈ కారణం గురుగ్రామ్, ఫరీదాబాద్, దక్షిణ ఢిల్లీ, అల్వార్ జైపూర్‌లకు ఇంతదాకా వరద తాకిడిలేదు. ఆరావళీ అన గానే అరుదైన వృక్ష జంతు జాతులకు నెలవు. కాగా కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందన్న భయాందోళనలు తలెత్తాయి. భౌగోళిక పరిస్థితులు, వాటికి ప్రయోజనాలు కలిగించే అంశాలపై అధ్యయనం చేయకుండానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానిని దేశ అత్యున్నత ధర్మాసనం కాక తాళీ యంగా ఆమోదించడమూ జరిగిపోయాయి. ఆందో ళనలను ఎదుర్కొనే క్రమంలో మళ్లీ ఇప్పుడు కేంద్రం నాలిక్కరుచుకుని కొత్త మైనింగ్ అనుమతులేవీ ఇవ్వరాదని నిర్ణయించింది. స్థానిక నైసర్గిక స్వరూపం, జీవవైవిధ్యత, పర్యావరణ సున్నిత త్వాన్ని దృష్టిలో ఉంచుకుని తమ తాజా ఆదేశాలను ఆరావళీలోని మరికొన్నిగుట్టలు మైనింగ్ నుంచి రక్షణ పొందడం ఆహ్వానించదగిన నిర్ణయమే!
Read hindi news : hindi.vaartha.com
Epaper :epapervaartha.com
Read Also: