ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు(Silver Price) ఒక్కసారిగా భారీగా క్షీణించాయి. ఎంసీఎక్స్‌లో మార్చి కాంట్రాక్ట్ వెండి కిలో ధర దాదాపు రూ.21 వేల మేర తగ్గింది. సోమవారం రూ.2.54 లక్షల వరకు ఎగబాకిన వెండి ధర, గంట వ్యవధిలోనే రూ.2.33 లక్షల కనిష్ఠానికి పడిపోయింది. ఈ అకస్మాత్తు పతనం మదుపర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
Read also: Gold Mines: కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం
ఫ్యూచర్ మార్కెట్(Futures market)తో పాటు స్పాట్ మార్కెట్లోనూ వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.2.39 లక్షల స్థాయికి దిగివచ్చింది. ధరల్లో ఈ మార్పు ఆభరణాల వ్యాపారులు, పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతోంది.

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పరుగులు పెట్టాయి. సాధారణంగా ఔన్స్‌కు 50 డాలర్ల లోపే ట్రేడయ్యే వెండి, ఒక్కసారిగా భారీగా పెరిగి సోమవారం ఒక దశలో 80 డాలర్లకు పైగా చేరింది.
రష్యా–ఉక్రెయిన్ శాంతి సంకేతాలు, తగ్గిన బంగారం వెండి ధరలు
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధర కూడా దాదాపు 2 శాతం తగ్గింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.37 లక్షల స్థాయికి పడిపోయింది. బంగారం, వెండి ధరలు తగ్గడానికి పలు అంతర్జాతీయ కారణాలు ప్రభావం చూపినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా సానుకూల సంకేతాలు రావడంతో యుద్ధం ముగిసే అవకాశాలపై అంచనాలు పెరిగాయి. ఈ పరిణామం కారణంగా సేఫ్ హేవెన్ పెట్టుబడులపై డిమాండ్ తగ్గి, వెండి ధరలు దిగివచ్చాయి. గత ఏడాది కాలంలోనే వెండి ధరలు సుమారు 181 శాతం పెరగడంతో, గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమూ ధరల పతనానికి మరో కారణంగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: