టాటానగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో(CM Chandrababu) జరిగిన అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే యలమంచిలి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించిన తీరును సీఎం ప్రశంసించారు. వారి అప్రమత్తత, వృత్తిపరమైన నైపుణ్యం వల్ల 150 మందికిపైగా ప్రయాణికులను సురక్షితంగా రక్షించగలిగామని పేర్కొన్నారు. మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా వెంటనే కోచ్‌లను వేరుచేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని, మృతుడి కుటుంబానికి తన హృదయపూర్వక సానుభూతిని తెలిపారు.
Read also: Karveti Nagaram temple: ముక్కోటి వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్దం

రైళ్ల రాకపోకలకు అంతరాయం
సోమవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న 18189 ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ1, బీ2 అనే రెండు ఏసీ కోచ్‌లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. (CM Chandrababu) ఈ ఘటనలో బీ1 కోచ్‌లో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) మృతి చెందారు. మంటలను గుర్తించిన లోకో పైలట్లు వెంటనే రైలును ఆపడంతో ప్రయాణికులు అప్రమత్తమై బయటకు రావడంతో మరింత ప్రాణనష్టం తప్పింది. వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి గురైన రెండు కోచ్‌లను రైలు నుంచి వేరు చేసి, మిగతా రైలును సామర్లకోటకు పంపించారు. అక్కడి నుంచి ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదం కారణంగా విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించి, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను అన్వేషిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: