ఆంధ్రప్రదేశ్లో మొబైల్ కనెక్టివిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మారుమూల, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్వర్క్ను మెరుగుపరచేందుకు మొత్తం 707 కొత్త మొబైల్ టవర్ల (Cell site) ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ టవర్ల నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కింద భరిస్తుండగా, టవర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం సంస్థలు ఈ టవర్లను ఏర్పాటు చేయనున్నాయి.
Read also: AP: మార్చిలోగా కోటి మందికి స్వమిత్వ యాజమాన్య హక్కు పత్రాలు

AP Mobile Towers
అటవీ, కొండ ప్రాంతాల్లో నెట్వర్క్ పూర్తిగా అందుబాటులో లేక
రాష్ట్రంలో మొబైల్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న టవర్లు సరిపోక తరచూ సిగ్నల్ సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గిరిజన, అటవీ, కొండ ప్రాంతాల్లో నెట్వర్క్ పూర్తిగా అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం కొత్త టవర్ల నిర్మాణంపై దృష్టి సారించింది. రెవెన్యూ శాఖకు చెందిన ఖాళీ భూములు, ఏజెన్సీ ప్రాంతాల్లోని అటవీ భూములను అవసరానికి అనుగుణంగా వినియోగించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేని కారణంగా నిర్మాణ పనులకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాటిని అధిగమించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొబైల్ సిగ్నల్ సమస్య అత్యధికంగా ఉండటంతో, ఈ ఒక్క జిల్లాలోనే 100 కొత్త టవర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే 42 ప్రాంతాల్లో జాయింట్ సర్వేలు పూర్తయ్యాయి, మరో 13 ప్రాంతాలను టెలికాం సంస్థలకు అప్పగించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 4జీ సేవలను బలోపేతం చేయడానికి 624 టవర్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. 295 ప్రాంతాల్లో సర్వేలు పూర్తయ్యాయి, వాటిలో 37 లొకేషన్లను తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యలతో రాష్ట్రంలో డిజిటల్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడనుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: