కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సందర్భంలో విజయవాడ(Vijayawada) నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి జరగనున్న వేడుకల నేపథ్యంలో నగరంలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు అన్ని ఫ్లైఓవర్లను రాత్రి సమయంలో మూసివేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు జనవరి 13 వరకు రాత్రి వేళల్లో అమలులో ఉంటాయని తెలిపారు.
Read Also: AP: పెరిగిన మద్యం అమ్మకాలు.. కొత్త పాలసీతో ప్రభుత్వానికి ఆదాయం

రోడ్లపై వేడుకలకు నిషేధం
నూతన సంవత్సర వేడుకల (Vijayawada)పేరిట రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం పూర్తిగా నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి చర్యలకు అనుమతి ఉండదన్నారు.
యువత అతివేగంగా వాహనాలు నడపడం, బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తొలగించి శబ్ద కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
ట్రిపుల్ రైడింగ్ సహా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అందరూ పోలీసులకు సహకరించి కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, భద్రంగా తమ ఇళ్ల వద్దే జరుపుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు ప్రజలను కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: