‘ది రాజాసాబ్’ సినిమా (The Rajasaab movie) షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రభాస్ (Prabhas) సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ప్రభాస్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Thalapathy Vijay: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కింద పడిపోయిన విజయ్
‘శంబాల’ సినిమా అద్భుతమైన విజయం
తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, తోటి నటుల విజయాలను గుర్తించి అభినందించడం ప్రభాస్ (Prabhas) కు కొత్త కాదు. ఈసారి కూడా అదే చేశారు. టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ సినిమా విజయం సాధించడంపై ప్రభాస్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా “ఆది అండ్ టీమ్‌కు కంగ్రాట్యులేషన్స్.. ‘శంబాల’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది” అంటూ ప్రశంసలు కురిపిస్తూ మూవీ పోస్టర్‌ను షేర్ చేశారు.
ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జంటగా నటించిన ‘శంబాల’ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా నిలకడగా వసూళ్లు రాబడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: