న్యూజిలాండ్‌తో (Team India) జరగబోయే మూడు వన్డేల సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ వెంటనే జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మాత్రం వీరిద్దరూ అందుబాటులో ఉంటారు. పాండ్యా కొంతకాలంగా వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉంటుండగా, బుమ్రా పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సీనియర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం లేదు.
Read Also: Indian Women Cricket: ఉమెన్స్ టీ20ల్లో భారత్ కొత్త చరిత్ర

అంతర్జాతీయ వన్డేలకు విశ్రాంతి
(Team India) దీంతో దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్‌కు మళ్లీ పిలుపు వచ్చే అవకాశం ఉంది. వన్డే జట్టును జనవరి 4 లేదా 5 తేదీల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు, అంతర్జాతీయ వన్డేలకు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, హార్దిక్ పాండ్యా బరోడా తరఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో ఆడటం తప్పనిసరి కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: