సాక్ష్యాల పరిశీలనలో న్యాయమూర్తులు కేవలం పత్రాలు, వాంగ్మూలాలకే పరిమితం కాకుండా, నిజానిజాలను గ్రహించే సామర్థ్యాన్ని కూడా వినియోగించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక అత్యాచార కేసులో కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ, నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. న్యాయ నిర్ణయాల్లో అనుభవం, పరిస్థితే కీలకమని స్పష్టం చేసింది.
Read also: Himachal Pradesh: వింత దొంగతనం.. శ్మశానంలో అస్థికల చోరీ

Sixth Sense
సాక్ష్యాలు నమ్మదగినవిగా లేనప్పుడు
ఈ కేసులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కింది కోర్టు నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా, హైకోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితుడికి వివాహం కోసం బెయిల్ మంజూరు చేశారు. ఈ ఏడాది జూలైలో బాధితురాలు, నిందితుడు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నట్లు ధర్మాసనం దృష్టికి వచ్చింది.
విచారణ సందర్భంగా బాధితురాలి వాంగ్మూలంలో స్పష్టమైన వైరుధ్యాలు ఉన్నాయని ధర్మాసనం గుర్తించింది. వైద్య నివేదికలు కూడా ఆరోపణలను పూర్తిగా నిర్ధారించలేకపోయాయని పేర్కొంది. సాక్ష్యాలు నమ్మదగినవిగా లేనప్పుడు, కేవలం ఆరోపణల ఆధారంగా శిక్ష విధించడం సరికాదని స్పష్టం చేస్తూ, నిందితుడికి ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ వర్తింపజేసి విముక్తి కల్పించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: