తెలంగాణ (Telangana) లో, వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి రెండో వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జనవరి మూడో వారం నాటికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు (SEC) ప్రభుత్వం (Telangana) ఇప్పటికే సంకేతాలు పంపింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగియడంతో ప్రస్తుతం ఇవి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. మరోవైపు.. హైదరాబాద్ (GHMC), ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది.
Read Also: Nizamabad: ATM దుండగులు కలకలం: రాత్రికి రాత్రి రూ. 30 లక్షలు మాయం
కొన్ని చోట్ల మినహాయింపు
ఈ నేపథ్యంలో గడువు ముగిసిన, ముగియనున్న అన్ని సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సర్కార్.. తాజాగా ఓఆర్‌ఆర్ (ORR) పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీతో కలిపి మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి.

కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు, రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే పట్టణ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలను అధికార పార్టీ ఒక ‘సెమీఫైనల్’గా భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: