మన దేశ ప్రత్యేక వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినవి.. దేశ విదేశాలను నుంచి వచ్చిన పర్యాటకు ఇండియాలోని వంటకాలకు ఫిదా అయిపోతుంటారు. మన వంటకాల రుచులను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఎందరో చెఫ్ (Chef) లు కృషి చేశారు. వీరి జాబితాలో సంజీవ్ కపూర్ ఒకరు.
Read Also: Sixth Sense: సాక్ష్యాలే కీలకం: అత్యాచార కేసుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
అత్యంత ధనిక చెఫ్‌గా సంజీవ్ కపూర్
భారతదేశంలోనే అత్యంత ధనిక చెఫ్ (Chef) గా సంజీవ్ కపూర్ (Sanjeev Kapoor) నిలవడం విశేషం. ఆయన నికర విలువ సుమారు రూ.1,165 కోట్లు. 1993లో ‘ఖానా ఖజానా’ అనే టీవీ షో ద్వారా వంటలను పరిచయం చేసిన ఆయన, 17 ఏళ్లపాటు కొనసాగిన ఈ షోతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ప్రపంచ వేదికలపై తన ప్రతిభను చాటుకున్నారు.

తన గుర్తింపును ఉపయోగించుకొని ఆయన ఓ బలమైన వ్యాపార సామ్రాజాన్ని స్థాపించారు. తనకు తెలిసిన వంటకాల గురించి సంవత్సరాలుగా, అతను 150 కి పైగా వంట పుస్తకాలను రాశాడు. వాటిని మార్కెట్‌లోకి తీసుకెళ్లాడు. దీంతో వాటికి ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఆయన రాసిన బుక్స్‌లో చాలా వరకు బెస్ట్ సెల్లర్లుగా నిలిచాయి. ఇవే కాదు ఆయన సొంతగా కొన్ని రెస్టారెంట్‌లను సైతం స్థాపించాయి. ఇప్పుడు అవి ప్రపంచవ్యాప్తంగాను ప్రసిద్ది చెందాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: